: థియేటర్లలో ‘నాన్నకు ప్రేమతో’ సందడి!...ఎన్టీఆర్ ద్వయానికి పాలాభిషేకం చేసిన అభిమానులు
భారీ అంచనాలతో తెరకెక్కిన టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చిత్రం ‘నాన్నకు ప్రేమతో’ సందడి మొదలైంది. విశ్వవ్యాప్తంగా 1,700 స్క్రీన్లపై నేడు విడుదల కానున్న ఈ చిత్రం అభిమానులను అలరించనుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రదర్శనకు ఎంపికైన థియేటర్ల వద్ద నేటి తెల్లవారుజాము నుంచే అభిమానుల కోలాహలం మొదలైంది. ఆయా థియేటర్ల వద్ద జూనియర్ ఎన్టీఆర్ భారీ కటౌట్లు ఏర్పాటు చేసిన అభిమానులు చిత్రం విజయవంతం కావాలని ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. కొబ్బరి కాయలు కొడుతున్నారు. విజయవాడలోని రాజ్, యువరాజ్ ధియేటర్ల వద్ద జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఆయన తాత, తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు సీనియర్ ఎన్టీఆర్ చిత్ర పటాలకు అభిమానులు పాలాభిషేకం చేశారు.