: అభివృద్ధి పేరిట ఏపీఎస్ ఆర్టీసీ పన్ను బాదుడు... ఏ బస్సులో ఎంతంటే...!


పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయి, లాభాల బాటన నడిచేందుకు నానా కష్టాలు పడుతున్న ఏపీ ఎస్ఆర్టీసీ అభివృద్ధి సెస్ రూపంలో ప్రయాణికులపై మరింత భారం మోపాలని నిర్ణయించింది. ఆర్డినరీ బస్సులు మినహా మిగతా అన్ని రకాల బస్సులపై రూ. 2 నుంచి రూ. 3 అదనపు చార్జీని నేటి నుంచి వసూలు చేయనున్నట్టు ప్రకటించింది. ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సు ప్రయాణికులపై రూ. 2, సూపర్ లగ్జరీ, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్, వెన్నెల బస్సుల్లో రూ. 3ను ఒక్కో టికెట్ పై వసూలు చేస్తామని అధికారులు తెలిపారు. దీని ఫలితంగా రోజుకు రూ. 40 లక్షల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్న అధికారులు సంవత్సరానికి రూ. 150 కోట్ల అదనపు ఆదాయాన్ని వెనకేయవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు ఎక్స్ ప్రెస్, సూపర్ లగ్జరీ బస్సుల్లో నిత్యమూ 40 లక్షల మంది వరకూ ప్రయాణిస్తున్నారు. ఈ నిధులతో బస్ స్టేషన్లలో ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరుస్తామని అధికారులు అంటున్నారు.

  • Loading...

More Telugu News