: క్రికెట్ అభిమానులకు చేదు వార్త!... ఈ ఏడాది భారత్-పాక్ సిరీస్ లేదన్న ఠాకూర్


ఈ వార్త క్రికెట్ అభిమానులకు నిజంగా చేదు వార్తే. భారత్, పాకిస్థాన్ లలోనే కాక విశ్వవ్యాప్తంగా మంచి ప్రజాదరణ ఉన్న భారత్-పాక్ సిరీస్ ఈ ఏడాది లేదని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ నిన్న తేల్చిచెప్పేశారు. భారత్, పాక్ క్రికెట్ జట్ల మధ్య ఈ ఏడాది ప్రత్యేకించి ద్వైపాక్షిక సిరీస్ లేదని ఠాకూర్ ప్రకటించారు. క్రికెట్ ఆడే దేశాలన్నీ పాల్గొనే సిరీస్ ల్లోనే ఇరు దేశాల జట్లు పోటీ పడతాయని చెప్పిన ఆయన, ద్వైపాక్షిక సిరీస్ కు ఎలాంటి ప్రణాళికలు లేవని తెగేసి చెప్పారు. గత నెలలో జరుగుతుందని భావించిన భారత్-పాక్ సిరీస్ కార్యరూపం దాల్చలేదు. అయితే ఈ ఏడాదైనా సదరు సిరీస్ ఉంటుందని భావించిన అభిమానులకు ఠాకూర్ చేదు వార్తను వినిపించారు.

  • Loading...

More Telugu News