: ఢిల్లీలో ఇక అడ్డదిడ్డంగా చెత్తను కాలిస్తే లక్షరూపాయల ఫైన్


దేశ రాజధాని ఢిల్లీలో విపరీతంగా కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో ముందుగా రోడ్లపై వాహనాలు తిరిగేందుకు నిబంధనలు విధించిన ప్రభుత్వం, ఇప్పుడు తాజాగా ఎక్కడపడితే అక్కడ చెత్తను కాల్చేవారికి లక్ష రూపాయల వరకూ జరిమానా వేయాలని నిర్ణయించింది. దీనిపై ఒక నోటిఫికేషన్ విడుదల చేసిన ఢిల్లీ అధికారులు రూ. 20 వేల నుంచి ఒక లక్ష రూపాలయల వరకూ ఫైన్ వేస్తామని హెచ్చరించారు. అయితే చెత్తను కాల్చడం తప్ప మరో మార్గం లేనప్పుడు దానికి మినహాయింపు ఇచ్చేందుకు అవకాశముంటుందన్నారు. అయితే ముందుగా ప్రజల్లో అవగాహన కల్పించి దీనిని అమలు చేయనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News