: ‘ఎర్ర’ దొంగల బీభత్స కాండ... ఆర్ఎస్సై ని లారీతో ఢీకొట్టిన వైనం


శేషాచలం అడవుల్లోని విలువైన ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించి కోట్లు కూడబెడుతున్న స్మగ్లర్లు తమకు అడ్డు వచ్చే వారిని ఎవరినైనా సరే మట్టుబెట్టేందుకు వెనుకాడటం లేదు. ఈ తరహాలోనే నిన్న రాత్రి చిత్తూరు జిల్లా పరిధిలో స్మగ్లర్లు దారుణానికి ఒడిగట్టారు. ఎర్రచందనం దుంగలతో వెళుతున్న ఓ లారీని ఆపేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో లారీని నిలువరించేందుకు కాస్తంత ముందుకు వెళ్లిన ఓ రిజర్వ్ ఎస్సైని స్మగ్లర్లు హతమార్చేందుకు యత్నించారు. ఆర్ఎస్సైని లారీతో ఢీకొట్టిన స్మగ్లర్లు లారీతో పరారయ్యారు. ఈ ఘటనలో ఆర్ఎస్సై తలకు తీవ్ర గాయమైంది. అయితే విషయాన్ని గ్రహించిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది, ఆర్ఎస్సైని ఆసుపత్రికి తరలించి లారీని వెంటాడి జిల్లాలోని ఏర్పేడు వద్ద పట్టేశారు. దీంతో లారీని అక్కడే వదిలేసిన స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు. తప్పించుకున్న స్మగ్లర్ల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News