: ఇద్దరు భార్యలుంటే ఆ జాబ్ ఇవ్వరట...యూపీ ప్రభుత్వం కొత్త రూల్!


తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం జారీ చేసిన ఒక జీవో వివాదాన్ని రేపుతోంది. 3,500 ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ లో అభ్యర్థులు ఎవరైనా సరే ఇద్దరు భార్యలతో కలిసి నివసిస్తూ ఉంటే వారు ఈ పోస్టులకు అనర్హులు. మహిళా అభ్యర్థులు కూడా ఏ వ్యక్తికైనా రెండో భార్యగా ఉంటే వారు కూడా అనర్హులేనని పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ముందుగా తమ వివాహ స్థాయిని వెల్లడించాల్సి ఉంటుంది. రేపు పెన్షన్ చెల్లింపు విషయంలో వివాదాలను అరికట్టే క్రమంలోనే ఈ నిబంధనను తీసుకువచ్చామని ప్రభుత్వం చెబుతుంటే... ముస్లింల హక్కులపై దాడిగా దీనిని ముస్లిం పర్శనల్ లా బోర్డు అభివర్ణించింది.

  • Loading...

More Telugu News