: చెన్నైలో పెరిగిపోతున్న గుండెజబ్బుల మరణాలు!


చెన్నై నగరంలో గతేడాది మరణించిన వారిలో గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులే అధికంగా వున్నాయి. 2015లో వివిధ వ్యాధుల కారణంగా మరణించిన వారిలో గుండె సంబంధిత వ్యాధుల మరణాలు 54 శాతంగా తేలాయి. చైన్నై కార్పొరేషన్ లో గత ఏడాది నమోదైన మరణాల డేటాను అనుసరించి ఈ అంశం వెల్లడైంది. ఈ నగరంలో ప్రతీరోజు సుమారు 88 మంది హార్ట్ ఎటాక్, గుండె సంబంధిత వ్యాధులతో కన్నుమూస్తున్నారు. మొత్తంమీద 2015లో చైన్నైలో 32,339 మంది గుండె జబ్బులతో ప్రాణాలొదిలారు. ఇదిలా ఉండగా చైన్నైలో 4,724 మంది వృద్ధాప్యపు సమస్యలతోను, 2,769 మంది మధుమేహం ముదరడంతోను, 2,47 మంది క్యాన్సర్ తోను, 943 మంది న్యూమోనియాతోను, 940 మంది రోడ్డు ప్రమాదాల కారణంగాను మరణించారని నమోదైంది. అలాగే మెత్తం 1,052 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చైన్నైలో ప్రతీ రోజూ కనీసం ముగ్గురు ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నారని వెల్లడైంది

  • Loading...

More Telugu News