: పఠాన్ కోట్ తరహా దాడులు మరిన్ని జరుగుతాయి: పాక్ మాజీ అధ్యక్షుడు ముషార్రప్ సంచలన వ్యాఖ్య


పాకిస్థాన్ ఆర్మీ మాజీ చీఫ్, ఆ దేశ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ కు చెందిన ‘ఆజ్ టీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత వైఖరిపై ఆయన నోరుపారేసుకున్నారు. పఠాన్ కోట్ తరహా దాడులు భవిష్యత్తులోనూ జరుగుతాయని ఆయన నిస్సిగ్గుగా ప్రకటించారు. పఠాన్ కోట్ దాడిపై భారత్ అతిగా స్పందిస్తోందని నిందారోపణలు చేసిన ముషార్రఫ్, ఉగ్రవాద బాధితురాలు భారత్ ఒక్కటే కాదన్నారు. పాక్ కూడా ఉగ్రవాద బాధితురాలేనని పేర్కొన్నారు. అందుకే పఠాన్ కోట్ దాడిపై భారత్ తరహాలో పాక్ స్పందించలేదన్నారు. అయితే పఠాన్ కోట్ తరహా ఘటనలకు చెక్ పడాల్సిందేనని మొసలి కన్నీరు కార్చారు. ఉగ్రవాదం విషయంలో భారత్, పాక్ పై ఒత్తిడి చేయజాలదని కూడా ముషార్రఫ్ వ్యాఖ్యానించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీపైనా నోరు పారేసుకున్న ముషార్రఫ్... మోదీ బోళా శంకరుడేనని, అయితే ఆ బోళా తనం తన దేశానికే పరిమితం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా వ్యాఖ్యానించారు. ఉగ్రవాద దాడి జరిగిన ప్రతిసారీ... భారత్, పాక్ పై వేలు చూపిస్తున్నదని, అయితే తన భూభాగంలోనే ఉగ్రవాదం ఉందన్న విషయాన్ని భారత్ మరిచిపోతోందని కూడా ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News