: ప్రపంచంలో అత్యుత్తమ టాపార్డర్ బ్యాట్స్ మన్ అతనే!: గంగూలీ
ప్రపంచంలో అత్యుత్తమ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అని మాజీ క్రికెటర్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రశంసించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి మ్యాచ్ ఓటమిపై మాట్లాడుతూ, ఓటమి టీమిండియాను బాధించి ఉంటుందని అన్నాడు. ఈ వన్డే ద్వారా బరిందర్ రూపంలో టీమిండియాకు మంచి బౌలర్ దొరికాడని వ్యాఖ్యానించాడు. మ్యాచ్ మొత్తం చూశానని చెప్పిన దాదా, రోహిత్ విధ్వంసకర బ్యాటింగ్ బాగుందని చెప్పాడు. ఏ క్షణంలో అయినా మ్యాచ్ స్వరూపం మార్చగల సత్తా రోహిత్ శర్మ సొంతమని దాదా అభిప్రాయపడ్డాడు. టీమిండియా భారీ స్కోరు సాధించినా ఓటమిపాలవ్వడం ఆటగాళ్లను నిరాశకు గురి చేసి ఉంటుందని గంగూలీ చెప్పాడు.