: కారును ఐస్ కప్పేస్తే.. ఇలా ఉంటుంది!
చలి తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ ఫొటో నిదర్శనం. న్యూయార్క్ లోని బఫెలోలో ఉన్న లేక్ ఎరి ప్రాంతంలో నిన్న ఒక కారును పార్కింగ్ చేశారు. ఈ కారును మంచు పూర్తిగా కప్పేసింది. ఆ దృశ్యాన్ని చూస్తుంటే ‘అది కారా? లేక మంచుతో చేసిన బొమ్మా?’ అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని బఫెలో న్యూస్ ఛానల్ డబ్ల్యుకేబీ డబ్ల్యు కు చెందిన వాతావరణశాఖ ఉద్యోగి మత్ బొవె ఈ ఫొటోను పోస్ట్ చేశాడు. ఆ కారు కదలాలంటే ఐస్ స్క్రాపర్ ను ఉపయోగించాల్సిందేనని ఆయన పేర్కొన్నాడు.