: తప్పతాగి.. రెస్టారెంటు అద్దాలు పగలగొట్టిన యువనటుడు!


తప్పతాగి.. రెస్టారెంటు అద్దాలు పగలగొట్టిన యువనటుడు నండూరి ఉదయ్ కిరణ్ ను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. 'ఫ్రెండ్స్ బుక్' సినిమాలో హీరోగా నటించిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం, సోమవారం అర్ధరాత్రి కాకినాడలోని రాజా ట్యాంకు సమీపంలో ఉన్న ఒక బార్ అండ్ రెస్టారెంట్ లో పీకల దాకా తాగాడు. తాగిన మత్తులో ఉన్న ఉదయ్ కిరణ్ తాను సినీ హీరోనని, అసిస్టెంట్ డైరెక్టర్ నని చెబుతూ నానా హంగామా చేశాడు. రెస్టారెంట్ కిటీకీ అద్దాలను పగలగొట్టాడు. దీంతో అక్కడి సిబ్బంది కాకినాడ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయ్ కిరణ్ ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఉద్యోగాలు, సినిమాల్లో అవకాశాలిప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడిన ఉదంతంలో ఒక కేసును గతంలో ఉదయ్ కిరణ్ పై కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేశారని చెప్పారు. ఈ మోసాలకు ఉదయ్ కిరణ్ పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలిందని చెప్పారు.

  • Loading...

More Telugu News