: కేటీఆర్, హరీష్ వస్తే నేనొస్తా...కేసీఆర్ వస్తే చంద్రబాబును తెస్తా: రేవంత్ రెడ్డి


హైదరాబాదులో పూర్తి స్థాయి అభివృద్ధి చేపట్టింది ఎవరని రేవంత్ రెడ్డి ఆయన నిలదీశారు. హైదరాబాదులో నిజాం కళాశాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణకు మకుటంగా నిలిచిన హైదరాబాదును అభివృద్ధి బాట పట్టించింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఏడాదిన్నర కాలంలోనే టీఆర్ఎస్ పార్టీ హైదరాబాదును అభివృద్ధి చేసేసిందా? అని ఆయన నిలదీశారు. కేటీఆర్ మాట్లాడుతూ, హైటెక్ సిటీ కట్టిర్రు, దాని ముందల మోరీ కట్టడం మరిషిన్రని ఎద్దేవా చేస్తున్నారని, అయ్యా! మిగులు బడ్జెట్ తో మోరీలు కట్టండి అని పాలన మీకు అప్పగిస్తే...ఆ పని కూడా మీకు చేతకావడం లేదని ఆయన విమర్శించారు. గ్రేటర్ హైదరాబాదులోని ప్రజలకు చెప్పేదేంటంటే... మీకు కష్టం వస్తే టీడీపీ, బీజేపీలు అండగా నిలబడతాయని ఆయన తెలిపారు. కేటీఆర్, హరీష్ ఇబ్బంది పెట్టడానికి వస్తే, ప్రజలకు అండగా నిలిచేందుకు తానొస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. అదే ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తే చంద్రబాబు వస్తారని...కేసీఆర్ తాతను తెచ్చుకుంటే నరేంద్ర మోదీని తెస్తామని ఆయన చెప్పారు. ప్రజల పక్షాన నిలబడడంలో టీడీపీ, బీజేపీ ముందుంటాయని, ప్రజలు టీడీపీని గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News