: కవితా!...నువ్వు చెప్పింది నిజమే, మీ నాన్న భోళాశంకరుడే!: రేవంత్ రెడ్డి


నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతోందని టీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాదు నిజాం కాలేజీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కవిత తన తండ్రి భోళాశంకరుడని చెబుతున్నారని, 'అవును నిజంగా ఆయన ఎవరికి భోళా శంకరుడు?' అని అడిగారు. 'మామా నాకు ఏమిస్తావు?' అని అడిగితే ...మీ బావ హరీష్ రావుకు 'కేసీఆర్ చెరువులు ఇచ్చారు. మరి 'నాన్నా బావకు చెరువులు ఇచ్చావు, మరి నాకు? అని మీ ఆన్న కేటీఆర్ అడిగితే, 'నువ్వు కమీషన్లు తీసుకో' అంటూ ఆయనకి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఇచ్చారు. అంతే కాదు, నువ్వు ఆడుకుంటానన్న ప్రతి సారీ 'కోట్లు ఇస్తున్న కేసీఆర్ మరి భోళా శంకరుడే'... అయితే ఆయన భోళాతనం కేవలం మీ కుటుంబానికే పరిమితం" అన్నారు రేవంత్. అదే భోళాశంకరుడు ప్రజలకు చేతిలో చిప్ప పెట్టి అడుక్కోమంటున్నాడని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News