: టీడీపీ లేదన్నారు...ఇప్పుడిదేంటి?: రేవంత్ రెడ్డి


తెలంగాణలో టీడీపీ లేదని టీఆర్ఎస్ నేతలు పలు సందర్భాల్లో పేర్కొన్నారు... టీఆర్ఎస్ నేతలు టీడీపీ బహిరంగసభకు వచ్చి ఉంటే ఆ విషయం కేసీఆర్, కేటీఆర్ లకు తెలిసేదని టీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాదు నిజాంకాలేజీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణను పటేల్, పట్వారీ వ్యవస్థ పట్టి పీడిస్తే, వారి బారి నుంచి తెలంగాణ ప్రజలకు ముక్తి కల్పించింది నందమూరి తారకరామారావు అన్న విషయం అంతా గుర్తు చేసుకోవాలని సూచించారు. జైతెలంగాణ అంటూ ఎంతో మంది అమరవీరులు ఆత్మత్యాగం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయాన్ని అంతా గుర్తుంచుకోవాలని, కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ నియంతృత్వ పోకడలను అడ్డుకునేందుకు నడుంబిగించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. దళితులపై జరుగుతున్న అమానవీయకాండపై పోరాడేందుకు దళితులు, మానహక్కుల నేతలు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆయన ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News