: బీజేపీ, శివసేన, టీఆర్ఎస్ పార్టీల మద్దతుతోనే ఎంఐఎం మనుగడ: డిగ్గీ రాజా
బీజేపీ, శివసేన, టీఆర్ఎస్ పార్టీల మద్దతుతోనే హైదరాబాదులో ఎంఐఎం పార్టీ మనుగడ సాగిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ, ఎంఐఎం అక్రమ పొత్తుకు చరమగీతం పలకాలని పిలుపునిచ్చారు. బీజేపీ మద్దతు ఎంఐఎంకి లేకపోతే ఆ పార్టీ వద్ద అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని ఆయన నిలదీశారు. హైదరాబాదులో కనపడుతున్న మెట్రోరైల్, గోదావరి నదీజలాలు, హైటెక్ హంగులు కాంగ్రెస్ చేసిన అభివృద్ధేనని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ, ఎంఐఎం వంటి మతోన్మాద శక్తులకు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు.