: కండల వీరుడికి కాసులు ముట్టలేదట!
గత ఏడాది విడుదలైన ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘బజరంగీ భాయీజాన్’. మన దేశంలో రూ.300 కోట్లు, విదేశాల్లో రూ.300 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. అయితే, ఈ చిత్రానికి సంబంధించి హీరో సల్మాన్ కు ముట్టజెప్పాల్సిన కొంత సొమ్ము ఇంకా అందలేదట. దీంతో కండల వీరుడు అసంతృప్తిగా ఉన్నాడని బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక, టాలీవుడ్ కు వస్తే 'అత్తారింటికి దారేది' చిత్రం నిర్మాత తనకు చెల్లించాల్సిన పారితోషికం బ్యాలెన్స్ ను ఇంకా ఇవ్వలేదంటూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు. తనకు చెల్లించాల్సిన రూ.2 కోట్లు ఇవ్వలేదని ఆ ఫిర్యాదులో పవన్ పేర్కొన్నారు.