: బీప్ సాంగ్ వివాదంలో పోలీసుల ముందు హాజరైన అనిరుధ్
బీప్ సాంగ్ వివాదంతో అప్రదిష్ట మూటగట్టుకున్న కోలీవుడ్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ పోలీసు విచారణకు హాజరయ్యాడు. ఈ మేరకు అనిరుధ్ మీడియా ప్రతినిధులకు వాట్స్ యాప్ మెసేజ్ పెట్టాడు. గత రాత్రి కోయంబత్తూరు పోలీసుల ముందు విచారణకు హాజరైనట్టు తెలిపాడు. బీప్ సాంగ్ కు తాను సంగీతం సమకూర్చలేదని రెండు పేజీల వివరణ ఇచ్చినట్టు అనిరుధ్ తెలిపాడు. కాగా, శింబు పాడిన బీప్ సాంగ్ లో మహిళలను కించపరిచే సాహిత్యం ఉందని పేర్కొంటూ మహిళా సంఘం ఐద్వా కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో విచారణకు హాజరుకావాలంటూ పలు మార్లు పోలీసులు కోరడంతో అనిరుధ్ హాజరయ్యాడు.