: పశ్చిమబెంగాల్ మత్స్యకారులను విడుదల చేసిన బంగ్లాదేశ్
పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన 178 మంది మత్స్యకారులను బంగ్లాదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. బగెర్ హత్ జైలులో ఉన్న మత్స్యకారులందరినీ ఇవాళ ఉదయం 8 గంటల ప్రాంతంలో విడుదల చేశామని సంబంధిత శాఖ సహాయ మంత్రి ప్రకటించారు. తమ సముద్ర జలాల్లోకి ప్రవేశించారని రెండు నెలల కిందట 179 మంది మత్స్యకారులు, 14 మంది ప్రయాణికులను బంగ్లాదేశ్ తీరప్రాంత రక్షకదళ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో సంజయ్ సమంత (45) అనే మత్స్యకారుడు వారి అదుపులో వుండగా చనిపోయాడని తెలిపారు. విడుదల చేసిన వారితో పాటు అతని శవపేటికను కూడా పంపించారు. విడుదలైన వారంతా రేపు పశ్చిమబెంగాల్ లోని సౌత్ పరగణాస్ జిల్లాలోని నామ్ ఖన్నా తీరానికి చేరుకుంటారు.