: బరిందర్ స్రాహను పొగడ్తల్లో ముంచెత్తిన బెయిలీ
ఆస్ట్రేలియా సిరీస్ ద్వారా అరంగేట్రం చేసిన పంజాబ్ పేసర్ బరిందర్ స్రాహను ఆసీస్ ఆటగాడు జార్జ్ బెయిలీ పొగడ్తల్లో ముంచెత్తాడు. సెంచరీతో రాణించిన బెయిలీ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ, బరిందర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని పేర్కొన్నాడు. సీనియర్లు ప్రభావం చూపని పిచ్ పై బరిందర్ అద్భుతమైన బంతులతో ప్రభావం చూపాడని చెప్పాడు. మూడు వికెట్లు తీసి, సత్తాచాటిన బరిందర్ లయ తప్పని బంతులతో స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నాడు. బరిందర్ బంతుల్లో వైవిధ్యంతో పాటు పేస్ కూడా బాగుందని బెయిలీ తెలిపాడు. బరిందర్ కు మంచి భవిష్యత్ ఉందని బెయిలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, తొలి వన్డేలో బరిందర్ తీసిన మూడు వికెట్లతో పాటు, అశ్విన్ రెండు వికెట్లతో రాణించగా, ఐదు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.