: 'ఫోన్ తో జీవితాంతం బ్రతకలేం బ్రో'...అంటూ కామెంట్ చేసిన హాలీవుడ్ నటిపై విమర్శలు


గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమలో హాలీవుడ్ నటి జెన్నీఫర్ లారెన్స్ చేసిన ఓ వ్యాఖ్య విమర్శలపాలు చేసింది. ఉత్తమ నటిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న అనంతరం జెన్సీఫర్ లారెన్స్ మీడియా సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ సెల్ ఫోన్ లో మెసేజ్ చూసుకుంటూ ఆమెను ఓ ప్రశ్న అడిగాడు. అతని ప్రశ్నను మధ్యలోనే ఆపేసిన జెన్నీఫర్ లారెన్స్...'ఫోన్ తో జీవితాంతం బ్రతకలేం బ్రో (బ్రదర్)' అంటూ 'ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో ఉన్నా'మని నవ్వుతూ గుర్తుచేసింది. దీంతో ఆ రిపోర్టర్ జెన్నీకి క్షమాపణలు చెప్పి, తన ప్రశ్న అడిగాడు. దానికి ఆమె సమాధానం చెప్పింది. ఆ తరువాత ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. మీడియా ప్రతినిధితో ఆమె వ్యవహార శైలి సరికాదంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News