: రోజా సస్పెన్షన్ పై స్పీకర్ కు జగన్ లేఖ
తమ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ప్రభుత్వం విధించిన ఏడాది సస్పెన్షన్ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు లేఖ రాశారు. రోజాపై సంవత్సరం పాటు సస్పెన్షన్ విధించడం రాజ్యాంగ విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. నిబంధన 340 ప్రకారం రోజాపై సంవత్సరం పాటు సస్పెన్షన్ విధించారని, కానీ ఈ నిబంధన ప్రకారం సభ్యుడిని ఒక సెషన్ వరకు మాత్రమే సస్పెండ్ చేసేందుకు వీలు ఉంటుందని తెలిపారు. సభ్యుడిని సస్పెండ్ చేయాలంటే సభలో కచ్చితంగా ఓటింగ్ నిర్వహించాలని ఆయన గుర్తు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోజాను సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. కాబట్టి ఈ అంశాలను పరిశీలించి రోజాపై సస్పెన్షన్ వెంటనే వెెనక్కితీసుకోవాలని స్పీకర్ ను జగన్ కోరారు.