: రోహిత్ అద్భుత ఆట వృథాయేనా?
ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే క్రికెట్ మ్యాచ్ లో ఈ ఉదయం అద్భుత రీతిలో రాణించి 171 పరుగుల అజేయ శతకం చేసిన రోహిత్ శర్మ శ్రమ వృథాయేనా? ప్రస్తుతం ఆస్ట్రేలియా చేజింగ్ చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. లక్ష్యం 310 పరుగులు అయినప్పటికీ, ఆస్ట్రేలియా ఆటగాళ్లు సునాయాసంగా దాన్ని చేరుతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం 41.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసిన జట్టు మరో 49 బంతుల్లో 47 పరుగులు సాధిస్తే విజయం సాధించినట్టే. జట్టులో జార్జ్ బెయిలీ 120 బంతుల్లో 112 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో పెవీలియన్ దారి పట్టగా, కెప్టెన్ స్మిత్ 105 బంతుల్లో 119 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మరో 7 వికెట్లు చేతిలో ఉండటంతో ఆస్ట్రేలియా విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఏదైనా అద్భుతం జరిగి, భారత బౌలర్లు వరుస వికెట్లు తీస్తే తప్ప తొలి వన్డేలో పరాజయం తప్పకపోవచ్చు.