: ఇస్తాంబుల్ లో భారీ పేలుడు
టర్కీ రాజధాని ఇస్తాంబుల్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఇక్కడి ప్రధాన టూరిస్ట్ అట్రాక్షన్ లో ఒకటైన సుల్తానమెత్ స్క్వేర్ సమీపంలో పేలుడు సంభవించింది. ఆ వెంటనే స్పందించిన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సహాయక చర్యలను ప్రారంభించాయి. బాంబు పేలుడు తీవ్రతకు చాలా మంది గాయపడ్డట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ ప్రాంతంలోని తొప్కాపీ పాలెస్, బ్లూ మాస్క్ లను చూసేందుకు నిత్యమూ వేలాది సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. గాయపడిన వారిలో పలువురు విదేశీయులు కూడా ఉన్నారని సమాచారం. కాగా, గత సంవత్సరం టర్కీపై రెండు సార్లు బాంబుదాడులు జరుగగా, దాదాపు 130 మందికి పైగా చనిపోయారు.