: త్రిపుర సీఎం పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్!
చిన్నా చితకా వ్యక్తి పేరిట కాదు, ఏకంగా త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ను గుర్తుతెలియని వ్యక్తులు నిర్వహిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఇంటర్ పోల్ సాయం కావాలని త్రిపుర పోలీసులు సర్కార్ ను కోరుతున్నారు. త్రిపుర సీఎం పేరిట తెరచిన నకిలీ ఖాతాను ఇతర దేశాల నుంచి నిర్వహిస్తున్నట్లు పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్ పోల్ సహాయంపై క్యాబినెట్ ఒక నిర్ణయానికి రాగానే నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభిస్తామని వారు పేర్కొన్నారు.