: కొరకరానికొయ్యలపై టెస్టు కెప్టెన్ ను ప్రయోగించిన ధోనీ
టీమిండియాకు కొరకరానికొయ్యలుగా మారిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, జార్జ్ బెయిలీలను విడదీసేందుకు మహేంద్ర సింగ్ ధోనీ అందుబాటులో ఉన్న వనరులన్నీ వినియోగించుకుంటున్నాడు. వీరిద్దరూ క్రీజులో పాతుకుపోయి బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతుండడంతో టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని బౌలింగ్ కు దించాడు. అశ్విన్ స్థానంలో బౌలింగ్ చేసిన కోహ్లీ వేసిన ఓవర్ లో ఆసీస్ బ్యాట్స్ మన్ 5 పరుగులు పిండుకున్నారు. స్టీవ్ స్మిత్ (67), జార్జ్ బెయిలీ (79)టీమిండియా బౌలర్లను ఆడుకుంటున్నారు. మొదట్లో బరిందర్ స్రాన్ రెండు వికెట్లు తీసి ఆధిక్యం ప్రదర్శించినా, నెమ్మదిగా ఆసీస్ ఆటపై పట్టు సాధించింది. కీలక సమయాల్లో టీమిండియా వికెట్లు తీయడంలో వెనుకబడిపోవడంతో 29 ఓవర్లు ఆడి రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు 172 పరుగులు చేసింది.