: చంద్రబాబు ఒక అయస్కాంతం లాంటివారు!: కేంద్రమంత్రి అనంతకుమార్ పొగడ్తల వర్షం
ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ పొగడ్తలతో ముంచెత్తారు. విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సు ఆఖరి రోజున ఆయన ప్రసంగిస్తూ, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో చంద్రబాబు అయస్కాంతం వంటి వారని, ఆయన్ను చూస్తే, ఎవరైనా ఇన్వెస్ట్ చేసేస్తారని అభివర్ణించారు. నవ్యాంధ్రకు నూతన రాజధానిగా అమరావతి నగర నిర్మాణాన్ని తలపెట్టిన ఆయన అపర విశ్వకర్మ వంటివారని కొనియాడారు. ఏపీలో గెయిల్, హెచ్పీసీఎల్ సంస్థలు కలసి రూ. 30 వేల కోట్లతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయనున్నాయని అనంతకుమార్ గుర్తు చేశారు. ప్లాస్టిక్ ఇంజనీరింగ్ విభాగంలో విద్యార్థుల శిక్షణ నిమిత్తం విజయవాడలో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో కూడిన ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.