: కిడ్నీ అమ్ముకుని పోటీల్లో పాల్గొంటానంటున్న క్రీడాకారుడు!


తన కిడ్నీ అమ్ముకుని పోటీల్లో పాల్గొనేందుకు భారత స్క్వాష్ ఆటగాడు రవి దీక్షత్ సిద్ధమయ్యాడు. ఇరవై సంవత్సరాల వయస్సు గల యూపీకి చెందిన రవి దీక్షిత్ గతంలో జరిగిన పోటీల్లో బంగారుపతకం సాధించాడు. ప్రస్తుతం రవి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. దీంతో తన కిడ్నీని రూ.8 లక్షలకు అమ్ముతానంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. 2010 ఏషియా జూనియర్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించాడు. వచ్చే నెలలో జరగనున్న స్క్వాష్ పోటీల కోసం తాను ప్రాక్టీస్ చేస్తున్నానని, తన శిక్షణకు అవసరమైన డబ్బులు లేకపోవడంతో తన కిడ్నీ అమ్ముకునేందుకు సిద్ధపడ్డానని రవి దీక్షిత్ పేర్కొన్నారు. కాగా, ఈ పోస్టును చూసిన యూపీ మంత్రి మూల్ చంద్ స్పందించారు. రవి దీక్షిత్ కు ఆర్థికసాయం చేస్తామని ప్రకటించారు. రవి కుటుంబం విషయానికొస్తే.. అతని తండ్రి స్థానిక చక్కెర కర్మాగారంలో చిన్న ఉద్యోగం చేస్తాడు.

  • Loading...

More Telugu News