: క్యాట్-2015 అన్నింటిలోనూ ‘టాపే’నట!...17 మందికి 100 మార్కులు, ఐదుగురికి ‘సున్నా’


భారత విద్యార్థులు దేశీయ పరీక్షల్లో సత్తా చాటుతున్నారు. తాజాగా విడుదలైన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2015 (క్యాట్) పరీక్షలో నూటికి నూరు శాతం మార్కులు తెచ్చుకుని తమకు తామే సాటి అని నిరూపించుకున్నారు. ఈ 17 మందిలో 16 మంది అబ్బాయిలైతే, ఒక్కరు మాత్రం అమ్మాయి. దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం) కళాశాలలతో పాటు అన్ని మేనేజ్ మెంట్ కళాశాలల్లో ప్రవేశం కోసం ఏటా క్యాట్ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది (క్యాట్-2014) ఇలా వందకు వంద మార్కులు సాధించిన వారి కంటే ఈ ఏడాది రెట్టింపు సంఖ్యలో విద్యార్థులు సెంట్ పర్సెంట్ మార్కులు సాధించేశారు. మొత్తం 1.79 లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది పరీక్షకు హాజరు కాగా, వారిలో 17 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు వందకు వంద మార్కులు సాధించారని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘హిందూస్థాన్ టైమ్స్’ తన తాజా సంచికలో ఓ ఆసక్తికరమైన వార్తను ప్రచురించింది. ఇదిలా ఉంటే, సున్నా మార్కులు సాధించిన వారి విషయంలోనూ ఈ ఏడాది ఫలితాలే ‘టాప్’గా నిలిచాయట. పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల్లో ఐదుగురికి ‘సున్నా’ మార్కులు వచ్చాయట.

  • Loading...

More Telugu News