: 150 పరుగుల రో'హిట్'!
పెర్త్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డే పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టులో రోహిత్ శర్మ మెరుపులు మెరిపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లను బాదేస్తూ, 150 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. మొత్తం 158 బంతులాడిన రోహిత్ 12 ఫోర్లు, 6 సిక్స్ ల సాయంతో 158 పరుగుల వద్ద ఉన్నాడు. మరో ఎండ్ లో మహేంద్ర సింగ్ ధోనీ తనదైన శైలిలో దూకుడుగా ఆడుతూ, 11 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ సాయంతో 17 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత స్కోరు 48 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 284 పరుగులు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలో 1000 పరుగులు చేసిన ఘనతను కూడా రోహిత్ సొంతం చేసుకున్నాడు.