: కేటీఆర్ 'రాజీనామా' చాలెంజ్ పై ఘాటుగా స్పందించిన రేవంత్ రెడ్డి... మీరూ చూడండి!


గ్రేటర్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించకుంటే, తన పదవికి రాజీనామా చేస్తానని ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన సవాలుపై తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి స్పందించారు. "కేటీఆర్ చెబుతున్నట్టుగా తెరాస పార్టీ గ్రేటర్ లో 100 స్థానాలు గెలుచుకుంటే నేను రాజీనామా సహా దేనికైనా సిద్ధమే. కేటీఆర్ తన మాటను నిలబెట్టుకుంటారా? రాజీనామానే కాదు, ఆయన ఇంకేదైనా కండిషన్లు పెట్టినా నేను సిద్ధమే. 100 సీట్లతో టీఆర్ఎస్ గెలిస్తే, ఏ శిక్షకైనా... కేసీఆర్ కుర్చీలో కూర్చుని ఏం రాస్తారో? ఏం శాసనాలు చేస్తారో... అన్నింటికీ నేను సిద్ధంగా ఉన్నా. మేమింకేం డిమాండ్ పెట్టట్లేదు" అని అన్నారు. తనను రాజీనామా చేయమన్నా, తెలంగాణ రాష్ట్రాన్ని విడిచి వెళ్లమన్నా వెళ్లిపోయేందుకు సిద్ధమేనని, కేటీఆర్ చెప్పినట్టు 100 సీట్లకు ఒక్కటి తగ్గినా, ఆయన మాట నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్, రేవంత్ ల సవాళ్లు, ప్రతి సవాళ్ల వీడియోను మీరూ తిలకించండి.

  • Loading...

More Telugu News