: బౌండరీ మీద బౌండరీ బాదేస్తున్న రోహిత్ శర్మ!
భారత ఓపెనర్ రోహిత్ శర్మ తన విశ్వరూపాన్ని ఆస్ట్రేలియా బౌలర్లకు చూపిస్తున్నాడు. 122 బంతులాడి 100 పరుగులు చేసిన రోహిత్, ఆపై 14 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు. ఇందులో ఓ సిక్స్, నాలుగు ఫోర్లు ఉన్నాయి. బొలాండ్ వేసిన 39వ ఓవర్లో రోహిత్ బౌండరీ మీద బౌండరీ బాదేశాడు. దీంతో స్కోరు వేగం ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం 41 ఓవర్లలో భారత స్కోరు ఒక వికెట్ నష్టానికి 221 పరుగులు కాగా, రోహిత్ శర్మ 125 పరుగులు, విరాట్ కోహ్లీ 78 పరుగులతో ఆడుతున్నారు. ఇదే రన్ రేట్ కొనసాగితే, 50 ఓవర్లలో భారత జట్టు 269 పరుగులు చేయగలుగుతుంది. మిగిలిన 9 ఓవర్లలో 10 పరుగుల చొప్పున సాధిస్తే స్కోరు 312 పరుగులవుతుంది.