: సంక్రాంతి రద్దీ దృష్ట్యా 2,600 ప్రత్యేక బస్సులు: మంత్రి శిద్దా
సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ఏపీ రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు 2,600 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నామని చెప్పారు. ఎవరైనా రవాణా కోసం ప్రయాణికుల నుంచి టిక్కెట్లపై అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ మంత్రి హెచ్చరించారు. బస్సుల తనిఖీలకు ఫ్లయింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేయాలని శిద్దా ఆదేశించారు.