: కండరాలు పట్టేయకుండా ఉండాలంటే ఇలా చేయండి!


మీరు ప్రతిరోజూ వ్యాయామం చేయని పక్షంలో మిమ్మల్ని కండరాలు పట్టేయడమనే (మజిల్ క్రేమ్ప్స్) సమస్య తరచూ వేధిస్తుంటుంది. ఫలితంగా భవిష్యత్ లో మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే ఈ కండరాలు పట్టేయడమనే సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే ఏం చేయాలి? తెలుసుకోండి.. * నరాలు పట్టేయడమంటే ఏమిటి? మన శరీరంలోని కండరాలు నిరంతరం పనిచేస్తుంటాయి. శ్వాస ప్రక్రియలానే ఇది కొనసాగుతుంది. శ్వాస ప్రక్రియలో మార్పులు సంభవించినపుడు శారీరకంగా మార్పులు వస్తాయి. అదే విధంగా కండరాల్లో కూడా నొప్పులు, బెణుకులు, పట్టేయడం లాంటి సమస్యలు మనకు తెలియకుండానే తలెత్తుతుంటాయి. శరీరంలో కండరాలకు సంబంధించి ఒక పటిష్టమైన వ్యవస్థ ఉంటుంది. ఏ కారణంగానైనా ఈ సమస్య తలెత్తినపుడు కొన్ని సెకెండ్లు లేదా నిమిషాలపాటు బాధ కలుగుతుంది. * శరీరంలోని ఏ భాగంలోని కండరాలకు ప్రధానంగా ఈ సమస్య తలెత్తుతుంటుంది? శరీరంలో ముఖ్యంగా రెండు రకాలుగా కండరాల సమస్యలు తలెత్తుతుంటాయి..ఏదైనా బరువులు ఎత్తినపుడు, ఒక్కసారిగా కదిలినపుడు లేదా వంగినపుడు ఈ ఇబ్బంది ఎదురవుతుంది. అయితే ఈ సమస్యను త్వరగానే పరిష్కరించుకోవచ్చు.అయితే రెండవ విధమైన సమస్య కండర వ్యవస్థలో ఏర్పడుతుంది. ఈ సమస్య సాధారణంగా వచ్చేదాని కన్నా వేరుగా ఉంటుంది. * నరాలు బెణకడానికి, పట్టేయడానికి కారణాలు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని చెబుతుంటారు. ముఖ్యంగా హైపర్ యాక్టివ్ గా ఉన్న చిన్నారుల్లో ఈ సమస్య కనిపిస్తుంటుంది. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం లోపం కూడా దీనికి ప్రధాన కారణంగా నిలుస్తుంది. డీహైడ్రేషన్ (ఒంట్లో నీటి శాతం తగ్గడం) కూడా నరాలు బెణకడానికి కారణమవుతుంది. నరాలు, కండరాలకు గాయాలైనపుడు కూడా ఈ సమస్య కనిపిస్తుంది. రక్తప్రసరణ సరిగ్గా జరగనపుడు కూడా ఈ సమస్య తలెత్తుతుంది. అలాగే కాళ్లు మడతపెట్టుకుని కూర్చున్నప్పుడు ఇటువంటి సమస్య ఎదురుకావడాన్ని మనం గమనించవచ్చు. * మందులతో ఈ సమస్యను అదుపుచేయవచ్చా? కొన్ని రకాలైన మందులు ఈ సమస్యనుండి విముక్తి కల్పిస్తాయి. అయితే అల్జీమర్స్, పార్కిన్ సన్, అధిక రక్తపోటు, కొలస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడుతూ మందులు వాడుతున్న వారిలో కండరాల బెణుకుల సమస్యలు అధికంగా కనిపిస్తాయి. అయితే అందరికీ ఈ సమస్య తలెత్తుతుందని చెప్పలేం. ఇది వ్యక్తులను అనుసరించి వేర్వేరుగా ఉండవచ్చు. అయితే ఈ సమస్య నివారణకు మందులు వాడే ముందు నిపుణులైన వైద్యుల సలహాలను తీసుకోవడం ఉత్తమం. * నివారణ మార్గాలు కండరాలు, నరాలకు తగినంత విశ్రాంతినివ్వాలి. నరాలు బెణికినపుడు ఆ ప్రాంతంలో కాస్త కాపడం పెట్టాలి. బెణికిన ప్రాంతంలో చిన్నపాటి ఒత్తిడి తీసుకురావాలి. మసాజ్ చేయాలి. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం సప్లిమెంట్లతో పాటు మినరల్స్ ను అధికంగా తీసుకోవాలి. అధికంగా నీటిని తాగాలి. లేచి నిలుచుని నడిచేందుకు ప్రయత్నించాలి. ఈ విధమైన సమస్య తలెత్తకుండా ఉండాలంటే ప్రతీరోజూ తగిన రీతిలో వ్యాయామం చేయాలి. అయితే వయసు మీదపడిన వారిలో కూడా ఈ సమస్య సాధారణంగా కనిపిస్తుంటుంది. అలాగే అస్తవ్యస్తమైన భంగిమలో పడుకున్నప్పుడు కూడా ఈ సమస్య కనిపిస్తుంది. జీవన విధానంలో కొద్దిపాటి మార్పులను తీసుకురావడం ద్వారా కండరాల బెణుకులు, నొప్పులు, పట్టేయడం లాంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

  • Loading...

More Telugu News