: ‘అనంత’ ఆసుపత్రిని సందర్శించిన తెలంగాణ స్పీకర్ సిరికొండ


రాయలసీమలో అత్యంత వెనుకబడిన జిల్లా అనంతపురంలో ‘రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్’ పేరిట పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న స్వచ్ఛంద సంస్థ అనంతపురం-బెంగళూరు జాతీయ రహదారిపై ఓ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. బత్తలపల్లిలో ఏర్పాటైన ఈ ఆసుపత్రి జిల్లాలోనే పేరెన్నికగన్న ఆసుపత్రిగా ఖ్యాతిగాంచింది. జిల్లాలో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులున్నా... అత్యంత విషమంగా ఉన్న ఏ కేసైనా, ఈ ఆసుపత్రికి రావాల్సిందే. ఇంతటి పేరు ప్రఖ్యాతులున్న ఆసుపత్రిని నేటి ఉదయం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి సందర్శించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న పలు సేవలను ఆయన ఆసక్తిగా పరిశీలించారు.

  • Loading...

More Telugu News