: స్వర్ణబార్ కల్తీ మద్యం కేసులో వీడిన చిక్కుముడి


విజయవాడలోని స్వర్ణబార్ కల్తీ మద్యం కేసులో చిక్కుముడి వీడింది. ఆ బార్ మద్యంలో ఘాటైన విషపదార్థం కలిసిందని ఎఫ్ఎస్ఎల్ ప్రాథమిక నివేదికలో తేలింది. దాంతో రెండో అభిప్రాయం కోసం ఈ మద్యాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపించారు. సీఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చాకే తుది నిర్ధారణ చేస్తామని పోలీసులు చెప్పారు. గతేడాది డిసెంబర్ 8న స్వర్ణబార్ లో కల్తీ మద్యం తాగి ఐదుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు సంస్థ విచారణను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు సహా పలువురిని విచారించి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News