: అమ్మాయిని వేధించారుగా... ఆరు నెలలు వీధులూడ్చండి!... హైకోర్టు ఆదేశం


నలుగురు కుర్రాళ్లు... మహారాష్ట్రలోని థానేలో చీపుర్లు పట్టుకుని వీధుల్లోకి వచ్చి ఊడ్చడం ప్రారంభించారు. వీరంతా మంచి పౌరుల్లా స్వచ్ఛభారత్ లో పాల్గొంటున్నారేమో అనుకుంటున్నారా? కాదండోయ్. ఓ అమ్మాయిని వేధించి, ఆపై ఆమెను కాపాడేందుకు వచ్చిన వ్యక్తిపై దాడి చేసినందుకు బాంబే హైకోర్టు వీరికి విధించిన శిక్షను అనుభవిస్తున్నారు. ఈ కేసులో నిందితులు అంకిత్, సుహాస్, మిలింద్, అమిత్ లు ఆరు నెలల పాటు సంఘ సేవ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. అంతకుముందు, తాము ఆ బాలికతో వివాదాన్ని పరిష్కరించుకున్నామని, తమపై కేసును కొట్టి వేయాలని కోర్టులో నిందితులు వాదన వినిపించగా, న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. కేసును కొట్టివేస్తున్నామని, అయినా భవిష్యత్తులో మరోసారి ఇలా ప్రవర్తించకుండా ఉండేందుకు సంఘసేవ శిక్ష విధిస్తున్నామని, మరో రూ. 5 వేలు టాటా మెమోరియల్ హాస్పిటల్ కు చెల్లించాలని జడ్జి ఆదేశించారు.

  • Loading...

More Telugu News