: చంద్రబాబుకు థ్రెట్... భద్రత పెంచాలని సూచించిన నిఘా వర్గాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మరింత భద్రత కల్పించాలని ప్రభుత్వానికి నిఘా విభాగం నుంచి సూచనలు అందాయి. ఆయన ప్రాణాలకు ముప్పు ఉన్నందున భద్రత కల్పించే విషయంలో అనుక్షణమూ అప్రమత్తంగా ఉండాలని అధికారుల నుంచి ప్రభుత్వానికి లేఖ అందింది. ఈ లేఖలో చంద్రబాబుకు మరింత భద్రతపై పలు సూచనలు ఉన్నాయి. ఆయన ప్రయాణించే చాపర్, విమానం తదితరాలను ప్రయాణానికి ముందు పూర్తిగా తనిఖీలు చేయాలని నిఘా విభాగం సిఫార్సు చేసింది. ఆయన ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ పక్కనే కృష్ణా నది ఉందని గుర్తు చేస్తూ, మర పడవల్లో పోలీసులతో 24 గంటలూ కాపలా కాయించాలని, బోట్లలో గజ ఈతగాళ్లు, సీఆర్పీఎఫ్ పోలీసులు ఉండాలని పేర్కొంది.