: దేశంలో ఎప్పుడూ మేమే ముందుంటాం.. ప్రాధమిక విద్యాభ్యాసంలో కేరళ ఘనత
దేశంలో అక్షరాస్యత శాతంలో ఎప్పుడూ ముందుండే కేరళ మరోమారు ప్రాథమిక విద్యాభ్యాసంలో వందశాతం విజయాన్ని నమోదు చేసుకుంది. సాక్షాత్తూ ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో ప్రాథమిక విద్యాభ్యాసంలో కేరళ 100శాతం లక్ష్యాన్ని సాధించిందని, ఇందుకు ఇక్కడి విద్యాశాఖను అభినందించాలని పేర్కొన్నారు. కేరళలో 2015లో మొత్తం 2.6 లక్షలమంది నాల్గవ తరగతికి సమానమైన పరీక్షకు హాజరుకాగా, వారిలో 2.2 లక్షల మంది విజయం సాధించడం విశేషం. ఈ పరీక్షను కేరళ వ్యాప్తంగా మొత్తం 6,613 కేంద్రాల్లో నిర్వహించారు.