: మరింత భారంకానున్న కనకదుర్గమ్మ దర్శనం!


బెజవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన కనకదుర్గమ్మ దర్శనం ఇకపై మరింత భారం కానుంది. ఇప్పటికే దర్శనం టికెట్ ధరలను పెంచిన ఆలయ అధికారులు తాజాగా ఇతర సేవల ధరలను కూడా పెంచేశారు. ఇప్పుడీ ధరలను అమలుచేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీంతో ఆర్జితసేవలైన చండీహోమం, లక్ష కుంకుమార్చన, శ్రీ చక్రార్చన, శాంతి కల్యాణం, సర్పదోష నివారణ రుసుములు భారీగా పెరగనున్నాయి. ముఖ్యంగా రూ.5 ఉన్న అన్నప్రాసన రేటు ఏకంగా రూ.301 చేయనున్నారు. ఇంతభారీగా ఆర్జిత రుసుములు పెంచడంపై అటు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో పునరాలోచనలో పడిన ఆలయ అధికారులు ధరలపెంపుపై మే 10లోపు అభిప్రాయాలు తీసుకుని తర్వాత అమలు చేయనున్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News