: బెల్టు బాంబులు కట్టుకుని బాగ్దాద్ షాపింగ్ మాల్ లో చొరబడ్డ దుండగులు
ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో కొద్దిసేపటి క్రితం కలకలం రేగింది. నగరంలో జనం రద్దీగా ఉన్న ప్రాంతంలో కారు బాంబు పేల్చిన ఉగ్రవాదులు బీభత్స కాండ సృష్టించారు. కారు బాంబు పేలుడులో ఇప్పటికే ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. పెద్ద సంఖ్యలో జనం గాయపడ్డారు. కారు బాంబు దాడితో వెనుదిరగని ఉగ్రవాదులు నడుములకు బెల్టు బాంబులు కట్టుకుని తమకు సమీపంలోని ఓ షాపింగ్ మాల్ లోకి దూరారు. షాపింగ్ మాల్ లో ఉన్న వారిలో మెజారిటీ ప్రజలను ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నట్లు తెలుస్తోంది. కారు బాంబు దాడితో అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకునేలోగానే ఉగ్రవాదులు షాపింగ్ మాల్ లోకి చొరబడ్డారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.