: ‘కాపు’ గర్జన కు అడ్డుతగిలితే ఊరుకోం: అంబటి రాంబాబు
ఈ నెల 31న నిర్వహించ తలపెట్టిన కాపు గర్జనకు అడ్డుతగలాలని చూస్తే సహించమని ఏపీ సర్కార్ ను వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు హెచ్చరించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.