: ఈ పండగ మాకు పెద్ద పండగ అవుతుంది: జగపతిబాబు
ఈ సంక్రాంతి పండగ తమకు పెద్ద పండగ అవుతుందని ప్రముఖ హీరో జగపతి బాబు అన్నారు. తనకు మొదటి నుంచి ప్రత్యేకంగా పండగలు చేసుకోవడమంటూ ఏమీ లేదని, ప్రతిరోజూ తనకు పండగేనని చెప్పారు. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈ పండగ తమకు పెద్ద పండగ అని ఎందుకంటున్నానంటే.. నాన్నకు ప్రేమతో చిత్రం పెద్ద హిట్ అవుతుందని, అందుకే తమ యూనిట్ మొత్తానికి పెద్ద పండగ అన్నానని జగపతి బాబు చెప్పారు.