: ఇకపై మెటర్నిటీ లీవ్ 8 నెలలు!
ఇకపై మెటర్నిటీ లీవ్ ను ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలకు పెంచాలని కేంద్ర మహిళ శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వంలోని ఇతర శాఖలు కూడా ఆమోదం తెలిపాయి. ప్రసూతి సెలవుపై నిర్ణయం కీలక దశకు చేరుకున్నట్లు సమాచారం. కాగా, మెటర్నిటి సెలవును కనీసం 8 నెలలు మంజూరు చేయాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ గట్టిగా వాదిస్తున్న విషయం తెలిసిందే.