: 'నాన్నకు ప్రేమతో' సినిమా కాదు.. ఒక జర్నీ: జూనియర్ ఎన్టీఆర్
‘నాన్నకు ప్రేమతో’ ఒక సినిమా కాదు.. ఒక జర్నీ అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. పిల్లలకు తమ తండ్రే మొదటి హీరో అని, అలా తనకు తన నాన్న అని ఆయన అన్నాడు. దర్శకుడు ఈ కథ చెప్పగానే ఒప్పేసుకున్నానని.. ఎందుకంటే, ఎంతో బాగుందని అన్నాడు. ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈచిత్రంలో ఆయన పాడిన పాట ‘ఫాలో ఫాలో యు’ గురించి ప్రశ్నించగా.. తానేమీ గొప్ప సింగర్ ని కాదని... కేవలం బాత్రూమ్ సింగర్నేనని అన్నారు. అయితే, ఈ చిత్రంలో ఈ పాటను తాను బాగా పాడగలగడానికి కారణం దేవిశ్రీ ప్రసాద్ అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.