: 6 బంతులు... 5 సిక్స్ లు... 39 పరుగులు: సత్తా చాటిన హార్దిక్ పాండ్యా


ఐపీఎల్ గతేడాది సీజన్ లో ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటిన హార్డిక్ పాండ్యా... టీమిండియా టీ20 జట్టులో చోటు పదిలం చేసుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా పొట్టి ఫార్మాట్ జట్టుకు అతడు ఎంపికయ్యాడు. ఈ సిరీస్ ఇంకా ప్రారంభం కాలేదు. ఇంకా దేశంలోనే ఉన్న హార్దిక్... దేశవాళీ సయ్యద్ ముస్తాక్ టోర్నమెంట్ లో భాగంగా నిన్న జరిగిన టీ20 మ్యాచ్ లో సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఒకే ఓవర్ లో ఏకంగా ఐదు సిక్స్ లు బాదిన అతడు ఆ ఓవర్ లో ఏకంగా 39 పరుగులు రాబట్టాడు. ఇంకో బంతిని అతడు బౌండరీ లైన్ దాటించి ఫోర్ గా మలిచాడు. టోర్నమెంట్ లో బరోడా తరఫున ఆడుతున్న అతడి వీర విహారానికి ఢిల్లీకి చెందిన మీడియం ఫేసర్ ఆకాశ్ సుడాన్ బెంబేలెత్తిపోయాడు. ఈ క్రమంలో ఐదు పరుగులను ఎక్స్ ట్రాగా సమర్పించుకున్నాడు. దీంతో ఐదు సిక్స్ లు (30 రన్స్), ఓ ఫోర్ (4 రన్స్)తో 34 పరుగులను హార్దిక్ రాబడితే... ఎక్స్ ట్రాగా వచ్చిన ఐదు పరుగులతో కలుపుకుని ఒకే ఓవర్ లో 39 పరుగులు బరోడా ఖాతాలో చేరిపోయాయి. దీంతో ఢిల్లీపై బరోడా సునాయాసంగా విజయం సాధించేసింది.

  • Loading...

More Telugu News