: డీఈ సత్యానందంపై మరో కేసు.. మళ్లీ జైలుకు!


‘కాల్ మనీ’ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న విద్యుత్ శాఖ డీఈ సత్యానందంను ఫోర్జరీ, చీటింగ్ కేసుకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం ఆయన్ని కోర్టులో హాజరుపర్చారు. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఫోర్జరీ, చీటింగ్ కేసుకు సంబంధించి ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు నమోదు అయింది. కాగా, కాల్ మనీ కేసులో ప్రధాన నిందితుడు సత్యానందం తొలుత పరారీలో ఉండటం, ఆ తర్వాత ముందస్తు బెయిల్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇబ్రహీం పట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడంతో ఆయన్ని అరెస్టు చేయడం, రిమాండ్ కు తరలించడం జరిగింది. కాల్ మనీ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆయన రిమాండ్ నిమిత్తం జైలులో ఉన్నాడు. తాజా కేసు నిమిత్తం కోర్టులో హాజరు పరిచేందుకు ఆయన్ని జైలు నుంచి తీసుకువచ్చారు. ఈ కేసులో కూడా కోర్టు రిమాండ్ విధించడంతో ఏ జైలు నుంచి సత్యానందంను తీసుకువచ్చారో అదే జైలుకు ఆయన్ని తరలించారు. దీంతో, రెండు కేసుల్లోనూ సత్యానందం రిమాండులో ఉన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News