: భారత్ పై విషం చిమ్మిన యునైటెడ్ జిహాద్ కౌన్సిల్... సోషల్ మీడియాలో వీడియో వైరల్!
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి తమ పనేనని ప్రకటించుకున్న యునైటెడ్ జిహాద్ కౌన్సిల్... తాజాగా భారత్ పై విషం చిమ్ముతూ ఓ వీడియోను విడుదల చేసింది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) పేరు చెబుతూ భారత్, తన పౌరులను ఉగ్రవాదులుగా మారుస్తోందని ఆ వీడియోలో సదరు ఉగ్రవాద సంస్థ మిలిటెంట్ మౌలానా అంజార్ షా సంచలన వ్యాఖ్యలు చేశాడు. నిఘా వర్గాల సమాచారం మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పోలీసులు ఇటీవల అతడిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. బెంగళూరులోని ఓ మదరసాలో మంజార్ షా ఇస్లాం గురువుగా వ్యవహరిస్తున్నాడు. ఉగ్రవాద సంస్థలతో లింకులున్నాయన్న సమాచారంతో అతడు అరెస్టయ్యాడు. అయితే అతడికి ఉగ్రవాదులతో సంబంధాలు బయటపడలేదన్న వార్తలు ఓ వైపు వినిపిస్తుండగానే తాజా వీడియో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.