: రామమందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు ఆగాలి: సీతారాం ఏచూరి
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, అయితే సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఆగాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సూచించారు. రానున్న కాలంలో దేశంలో మతోన్మాద రాజకీయాలు, ఘర్షణలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ ఎంపీలను ప్రధాని కట్టడి చేయలేకపోతున్నారన్న ఏచూరి, అసలాయన ఎన్ని దేశాలు వెళ్లారో ఆయనకే సరిగ్గా తెలియదని ఎద్దేవా చేశారు. పఠాన్ కోట్ లో దాడి జరుగుతుందని ఇంటెలిజెన్స్ ముందే హెచ్చరించిందని, ఈ సమాచారం ఉందని ప్రభుత్వమే స్వయంగా చెప్పడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులుండవని ఏచూరి స్పష్టం చేశారు. బల్దియా ఎన్నికల్లో సీపీఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, లోక్ సత్తా కలసి పోటీ చేస్తామని తెలిపారు.