: హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో అసిన్ పెళ్లి!


ఈ నెల 20వ తేదీన బాలీవుడ్ నటి అసిన్, ఢిల్లీకి చెందిన ఎంటర్ ప్రెన్యూర్ రాహుల్ శర్మను వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. హిందూ, క్రైస్తవ మత పద్ధతుల్లో ఈ వివాహం జరుగుతుందని సమాచారం. దేశ రాజధాని ఢిల్లీలోని ఒక హోటల్ లో ఈ వివాహ వేడుకల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసిన్-రాహుల్ వివాహ వేడుకలు జనవరి 19,20 తేదీల్లో రెండురోజుల పాటు జరగనున్నాయి. సుమారు 100 మంది అతిథులు పాల్గొననున్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత వేడుక అని, కుటుంబసభ్యులు, సమీప మిత్రులను మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. జనవరి 19వ తేదీన మెహింది వేడుక జరగనుంది. చాలా సింపుల్ గా జరగనున్న ఈ వివాహ వేడుకలో కేవలం శాకాహారం మాత్రమే అతిథులకు అందిస్తున్నారు. జనవరి 20వ తేదీన హిందూ, క్రైస్తవ మత సాంప్రదాయాలను అనుసరించి వారి వివాహం జరగనుంది. ఈ సందర్భంగా నిర్వహించే పార్టీకి మాత్రం రాహుల్ ఢిల్లీ మిత్రులు సహా సుమారు 250 మంది అతిథులను ఆహ్వానించినట్లు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్న వారు తెలిపారు.

  • Loading...

More Telugu News