: ఆ అలారం ఆగాలంటే... దాని మీద మూడు సెకెన్ల పాటు నిలబడాల్సిందే!


చలికాలంలో అలారం మోగుతున్నా మంచంపై నుంచి లేవబుద్ధి కాదు. దీంతో ఆ నిద్రమత్తులోనే అలారం స్టాప్ బటన్ నొక్కేసి అలాగే నిద్రపోతారు చాలామంది. అయితే, కెనడా, హాంగ్ కాంగ్ కి చెందిన శాస్త్రవేత్తల సహకారంతో విన్స్ టాం అనే వ్యక్తి వినూత్న అలారం ఆవిష్కరించాడు. ఈ అలారం చూసేందుకు డోర్ మ్యాట్ లా ఉంటుంది. దీనిలో ఓ సారి టైం సెట్ చేసి పడుకున్నాక దానిని ఆపాలంటే, మనం లేచి దానిపై మూడు సెకెన్ల పాటు నిలబడాలి. లేదంటే అది అలా మోగుతూనే ఉంటుంది. ఓసారి నిద్ర నుంచి అలా లేచాక ఇక పడుకోబుద్ధి కాదని విన్స్ టాం చెబుతున్నాడు. అలారం పెట్టుకుని పడుకున్నాక అది మోగుతుంటే స్నూజ్ బటన్ నొక్కి పడుకునే వాడినని, దాంతో చాలా కార్యక్రమాలు మిస్ అయ్యానని పేర్కొన్నాడు. అందుకే, 'నో స్నూజ్' అలారం ఉంటే బాగుంటుందని భావించానని, దాంతో ఈ అలారం తయారు చేయాలనే ఆలోచన వచ్చిందని తెలిపాడు. దీని ధర 50 నుంచి 90 డాలర్లు ఉంటుందని చెప్పిన టాం, దీనిని దిండుకింద పెట్టుకుని పడుకోవడం కుదరదని, ఇది మోగితే లేచి దీనిపై నిలబడాల్సిందేనని ఆయన స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News